AP: అల్లూరి జిల్లా అరకులోయ కేకే లైన్లో రైల్వే పట్టాలపై బండరాయి జారిపడటం వలన ఘోర ప్రమాదం జరిగింది. టైడా-చిమిడిపల్లి స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటన కారణంగా విశాఖలో అరకు-కిరండోల్ పాసింజర్ రైలు సహా ఆ మార్గంలో నడిచే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.