అన్నమయ్య: మద్యం బాటిళ్లు స్కానింగ్ చేశాకే విక్రయాలు జరుపుతున్నట్లు జిల్లా ఈఎస్ మధుసూదన్ పేర్కొన్నారు. మదనపల్లె పట్టణంలోని పలు మద్యం దుకాణాలు, బార్లను శనివారం ఈఎస్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వినయోగదారుడికి మద్యం బాటిళ్లను స్వయంగా స్కానింగ్ చేసి అందులోని వివరాలు చూపించి విక్రయించారు. ఈ విధంగా జిల్లాలో అన్ని చోట్ల జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.