E.G: రాజానగరం మండలం కొండ గుంటూరు గ్రామ శివారున ఏ విధమైన అనుమతులు లేకుండా అక్రమ గ్రావెల్ త్రవ్వకాల జరుపుతున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న జిల్లా భూగర్భ శాఖ అధికారి పీ. ఫణి భూషణ్ రెడ్డి అక్రమ గ్రావెల్ తవ్వకాల ప్రదేశానికి చేరుకుని, గ్రావెల్ త్రవ్వకాలు జరుపుతున్న ఒక ప్రోక్లైన్, రెండు టిప్పర్లు, ఒక ట్రాక్టర్ను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.