NLG: జిల్లాలో మరోసారి ధర్వేశిపురం వైన్స్ దరఖాస్తుల విషయంలో రికార్డు సృష్టించింది. వరుసగా ఈ ఏడాది కూడా అత్యధికంగా 144 దరఖాస్తులు అందుకుని జిల్లాలో తొలి స్థానంలో నిలిచిందని ఎక్సైజ్ సీఐ శివప్రసాద్ తెలిపారు. 2023లో కూడా ఈ వైన్స్‌కు 187 దరఖాస్తులు వచ్చాయన్నారు. జిల్లాలో అత్యధికంగా దరఖాస్తులు అందుకున్న వైన్స్గా ఇది వరుసగా రెండోసారి నిలిచింది.