E.G: నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని మహిళలకు ఉచిత ఉపాధి శిక్షణ అందించనట్లు మంత్రి కందుల దుర్గేశ్ ఆదివారం ప్రకటించారు. ఈనెల 23 నుంచి నిడదవోలులోని తన క్యాంప్ కార్యాలయం పై అంతస్తులో జ్యూట్ బ్యాగుల తయారీ కుట్టు సెక్షన్లో శిక్షణ అందిస్తామన్నారు. కాగా, పేర్ల నమోదు కోసం 9347651157, 98481 66644 నంబర్లను సంప్రదించాలని ఒక ప్రకటనలో సూచించారు.