NLR: చేజర్ల మండలం ఆదురుపల్లిలోని శ్రీత్రికోటేశ్వర విద్యాలయంలో ముందస్తు దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో దీపాలతో రంగవల్లికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థినీ విద్యార్థులు టపాకాయలు పేల్చి దీపావళి సంబరాలను ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. విద్యార్థులు స్వయంగా తయారుచేసిన మట్టి దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.