PDPL: కోర్టులో శనివారం సీపీఆర్ (CPR)పై అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా జడ్జి సునీత కుంచాల, డీఎంహెచ్ఐ డా.వాణిశ్రీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. డా.మౌనిక సీపీఆర్ ప్రక్రియపై ప్రాక్టికల్ డెమోన్స్లేషన్ ఇచ్చారు. హార్ట్ అటాక్ సమయంలో సీపీఆర్ ప్రాణాలు కాపాడుతుందని వైద్యులు సూచించారు.