MHBD: మరిపెడ మండలం ఉల్లేపల్లి శివారు భూక్య తండాకు చెందిన మౌంటైనేర్ భూక్య యశ్వంత్ నాయక్ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను ఆదివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. పలు పర్వతాలను అధిరోహించిన యశ్వంత్‌ను సజ్జనార్ అభినందించారు. అనంతరం CP, ఆయనకు తగిన సూచనలు, జాగ్రత్తలు తెలియజేసి, అతని సాహసాన్ని కొనియాడారు.