AP: కడప(D)లోని మారుమూల అటవీ ప్రాంతంలోని పెద్ద తండా గ్రామం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. కాలేజీకి వెళ్లాలంటే 50 కి.మీలు ప్రయాణించాల్సిన పరిస్థితి ఆ గ్రామస్థులది. అలాంటిది, ఇక్కడ సుమారు 300 గడపలకు 350 మంది పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. సగటున ఇంటికో ఉద్యోగి ఉన్న ఈ తండాలో టీచర్లు, పోలీసులు, డాక్టర్లు, బ్యాంక్ మేనేజర్లు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు వంటి వారున్నారు.