టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో బరిలోకి దిగడం ద్వారా, భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 500 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు ఆడిన 5వ ప్లేయర్గా రోహిత్ నిలిచాడు. హిట్ మ్యాన్ కంటే ముందు సచిన్ (664), కోహ్లీ (551), ధోనీ (535), ద్రవిడ్ (504) మాత్రమే ఈ ఘనతను సాధించారు.