GNTR: మేడికొండూరు మండలం కొర్రపాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన శివమణి (21) కడుపునొప్పితో బాధపడుతూ ఈ నెల 16న ఇంట్లో విషం తాగాడు.హుటాహుటిన అతని తల్లిదండ్రులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు శనివారం మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.