VZM: వంగర మండలం సీతారాంపురానికి క్షేత్ర సహాయకుడిని నియమించాలని స్థానికులు శనివారం MPDO రాజారావుకు వినతిపత్రం అందజేశారు. క్షేత్ర సహాయకుడు లేకపోవడంతో గత 5 నెలలుగా ఉపాధి పనులు లేవని గ్రామస్థులు వలస వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈకేవైసీ పూర్తి కాకపోవడం, ఉపాధి పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.