CTR: పులిచెర్ల మండలంలో ఏనుగుల గుంపు దాడుల్లో పంటలు కోల్పోయిన బాధిత రైతులకు శనివారం రూ: 3,18,500 నష్టపరిహారం చెల్లించినట్లు మాజీ జడ్పీటీసీ మురళీధర్, ఎఫ్ఎస్వో మహమ్మద్ షఫీ, ఎఫ్బీవో మధు తెలిపారు. ఈ మేరకు పాల్యం, దేవలంపేట పంచాయతీలోని 18 మంది రైతులకు నష్టపరిహారం చెక్కులను అందజేయడం జరిగిందన్నారు.