అన్నమయ్య: నందలూరు మండలం MM పురం క్రాస్ రోడ్డు వద్ద కంపచెట్లలో 20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అరెస్టు చేసినట్లు రాజంపేట రూరల్ సీఐ BV రమణ శనివారం తెలిపారు. నిందితులను ఆయన మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితులందరూ నందలూరు మండలానికి చెందిన వారిని పేర్కొన్నారు. మరి కొందరు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.