MDK: ఉమ్మడి మెదక్ జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. శనివారం ఉదయం నుంచే అభ్యర్థులతో ఎక్సైజ్ కార్యాలయాలు కిటకిటళాడాయి. మెదక్ జిల్లాలో (49 షాపులు) 1,350, సిద్దిపేట (93)లో 2,518, సంగారెడ్డి (101)లో 4,012 దరఖాస్తులు వచ్చాయి. కాగా షాపులకు దరఖాస్తుల గడువును ఈనెల 23 వరకు పొడిగించడంతో దరఖాస్తుల సంఖ్యం ఇంకా పెరగనున్నాయి.