BDK: దీపావళి పండుగ తరువాత ప్లాంట్ పునరుద్ధరణకు చర్యలు చేపడతామని మాజీ ఎంపీ రేణుకా చౌదరి తెలిపారు. శనివారం ఖమ్మంలో INTUC జనరల్ సెక్రటరీ షేక్ అబ్ధుల్ జలీల్, పాల్వంచ పట్టణ అధ్యక్షుడు బాలు నాయక్‌ను కలసి ప్లాంట్‌లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యను రేణుకా చౌదరి వివరించారు. పాల్వంచలోని NMDC ప్లాంట్ పునరుద్ధరణకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.