అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలో దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఆయన ఈ నెల 31 నుంచి నవంబర్ 1 వరకు గ్యోంగ్జులో జరిగే ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్(APEC) సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా ట్రంప్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ భేటీపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని US అధికారులు తెలిపారు.