ADB: గుడిహత్నూర్ మండలంలోని మాన్కాపూర్ గ్రామంలో జిల్లా SP అఖిల్ మహాజన్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దండారి ఉత్సవంలో పాల్గొని స్థానికులతో కలిసి నృత్యం చేస్తూ సందడి చేశారు. కనుమరుగవుతున్న ప్రాచీన కట్టుబాట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అడిషనల్ ఎస్పీ కాజల్ సింగ్, సిబ్బంది తదితరులున్నారు.