BHNG: రాజపేట మండలంలోని కల్వపల్లి గ్రామంలో దుర్ఘటన చోటుచేసుకుంది. వృత్తిరీత్యా తాటి చెట్లపైకి ఎక్కే కళ్లెం రామస్వామి శుక్రవారం తాటి చెట్టు ఎక్కే సమయంలో జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.