BDK: కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఇవాళ అశ్వాపురం మండలం అమ్మగారి పల్లిలో పర్యటించారు. నాణ్యమైన వరి విత్తనం అయిన WGL44 రకంపై క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. రైతులకు నాణ్యమైన విత్తనం అందించాలనే ముఖ్య ఉద్దేశంతో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా క్వాలిటీ సీడ్ ఫర్ విలేజ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు.