భారత క్రికెటర్ రింకూ సింగ్ రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. రెడ్‌బాల్ టోర్నీలో తొలి మ్యాచ్‌లోనే శతకంతో అదరగొట్టాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో యూపీ తరఫున ఆడుతూ.. (165*) పరుగులు చేశాడు. దీంతో ఓవరాల్‌గా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యుత్తమ సగటు కలిగి ఉన్న భారత ఆటగాళ్ల జాబితాలో పదో స్థానంలో నిలిచాడు.