TG: రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మారింది. దీనిని ఇకపై తెలంగాణ పోలీస్ హౌసింగ్ ఇన్ఫ్రాటెక్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్(TGPICS) గా పిలవనున్నారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరగా, ఇవాళ ఉత్తర్వులు జారీ అయ్యాయని కార్పొరేషన్ ఎండీ ఎం.రమేశ్ తెలిపారు. పేరు మార్పు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.