TG: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన తల్లి, కూతురు మరణించారు. మంచిర్యాల జిల్లాకు చెందిన విఘ్నేష్ తన భార్య రమాదేవితో కలిసి అమెరికాలో ఉంటున్న ఇద్దరు కూతుళ్ల వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో వారు కారులో ప్రయాణిస్తుండగా.. వీరి కారును ట్రక్కు ఢీకొట్టింది. విఘ్నేష్-రమాదేవి దంపతుల కుమార్తె తేజస్వి (32), ఆమె తల్లి రమాదేవి (52) ఈ ప్రమాదంలో మృతి చెందారు.