TG: గత పాలకులు ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు కేసులు వేశారని సీఎం రేవంత్ విమర్శించారు. అక్రమ సంపాదనతో SM ఏర్పాటు చేసి తమపై బురద జల్లే యత్నం చేశారని ఆరోపించారు. ‘మాకు వేరే వ్యవస్థ లేదు, మీరే మా కుటుంబ సభ్యులు’ అని ఉద్యోగులను ఉద్దేశించి అన్నారు. గ్రూప్-1 సమస్యలను ఎదుర్కొని నియామక పత్రాలు ఇచ్చామని, మొదటి ఏడాదే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం స్పష్టం చేశారు.