హీరో రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. అయితే వచ్చే ఏడాది మార్చిలో ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ కసరత్తు చెస్తోంది. ఈ క్రమంలో బుచ్చిబాబు పనుల్లో నిమగ్నమై సరిగా ఆహారం తీసుకోకపోవడంతో అనారోగ్యం పాలయ్యాడు. దీనిపై స్పందించిన చరణ్.. హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటే తర్వాతైనా షూటింగ్ చేసుకోవచ్చని చెప్పినట్లుగా సమాచారం.