TG: గ్రామ పంచాయతీ కారోబార్లు ప్రజా భవన్లో మంత్రి సీతక్కతో భేటీ అయ్యారు. 35 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు 51 జీవోను మినహాయించి, బిల్ కలెక్టర్లుగా ప్రమోషన్ ఇచ్చి, పే స్కేల్ వర్తింపజేయాలని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి సీతక్క, ప్రమోషన్ ఫైల్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పే స్కేల్‌పై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.