అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలో దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఏపీఈసీ సదస్సులో పాల్గొననున్న ఆయన.. ఉత్తర కొరియా అధినేత కిమ్‌తో భేటీ కానున్నట్లు సమాచారం. ఈ మేరకు ట్రంప్ యంత్రాంగం సంప్రదింపులు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే, ప్రస్తుతానికి పూర్తి ప్రణాళిక సిద్ధం కాలేదని తెలుస్తోంది.