VKB: తాండూర్ పట్టణంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారయింది. చెత్త కుండీలు లేకపోవడంతో స్థానిక ప్రజలు చెత్తను రోడ్డుపైనే వేస్తున్నారు. దీంతో ఆ చెత్తలో పందుల సంచరిస్తూ చెత్తను చిన్నాబిన్నం చేస్తున్నాయి. అంతేకాదు చెత్త నుంచి దుర్గంధం వస్తుందని, దోమలు, ఈగలు ఎక్కువయ్యాయని, దీని ద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తి ప్రమాదం ఉందని స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.