MNCL: లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ప్రజలకు మంచి వైద్య సేవలు అందుతున్నాయని తెలంగాణ రాష్ట్ర హెల్త్ కమిషనర్ డాక్టర్ అజయ్ తెలిపారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుతున్న వైద్య సేవలు గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ శ్రీనివాస్ ఉన్నారు.