AP: శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలను ఎమ్మెల్సీ నాగబాబు పరిశీలించారు. అనంతరం శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రవికుమార్‌తో కలిసి ఆర్టీసీ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడారు. ఆర్టీసీ బస్సుల్లో తిరిగిన అనుభవాలు తమకూ ఉన్నాయని నాగబాబు చెప్పారు. తక్షణ అనుకూలమైన పనులను నివేదిక రూపంలో అందిస్తే మండలిలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని తెలిపారు.