అన్నమయ్య: కలకడ మండలంలోని ఝరికోన ప్రాజెక్టు వద్ద శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. ఈ మేరకు స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై రామాంజులు పరిశీలించారు. మృతుడు నాలుగు నుండి ఐదు రోజుల క్రితం మరణించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.