VZM: గరివిడిలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో రైల్వే పట్టాలపై గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు రైల్వే GRP హెడ్ కానిస్టేబుల్ మధుసూదన్ రావు గురువారం తెలిపారు. గుర్తుతెలియని రైలు ఢీకొని గాని, రైలు నుంచి జారిపోవడం వలన గాని మృతి చెంది ఉండవచ్చును వెల్లడించారు. సంబంధిత వ్యక్తి వివరాలు తెలిసినవారు రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.