HNK: రాష్ట్ర వ్యాప్తంగా BC సంఘాల బందు పిలుపు నేపథ్యంలో HNKలోని KU యూనివర్సిటీలో ఇవాళ నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. LLB, B.Tech, ఎంఎస్సీ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఎంటెక్, దూర విద్య ఎంఎస్ఐఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయని పేర్కొన్నారు.