W.G: పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద గోదావరి నదిలో ఓ మహిళ మృతదేహం కొట్టుకువచ్చింది. పెనుగొండ ఎస్సై కె. గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 40 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న మహిళ మృతదేహాన్ని నదిలో గుర్తించారు. సిద్ధాంతం వీఆర్వో నాగేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.