NLG: దీపావళి, ధనలక్ష్మి పూజలను నరక చతుర్దశి రోజు, ఈనెల 20 తేదీ సోమవారం జరుపుకోవాలని, ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవ శర్మ నల్గొండ పట్టణంలో శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 1:55 నుంచి మంగళవారం మధ్యాహ్నం 2:59 వరకు అమావాస్య ఘడియలు ఉంటాయన్నారు.