సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త పరిటాల శ్రీరామ్ సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గానికి చెందిన 25 మంది లబ్దిదారులకు ఇవాళ మొత్తం రూ. 22,41,756ల విలువైన చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.