SRD: టపాసుల విక్రయ దుకాణాలు జనవాసాలకు దూరంగా ఖాళీ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవాలని సిర్గాపూర్ ఎస్సై మహేష్ శనివారం తెలిపారు. టపాసులు విక్రయించేవారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని చెప్పారు. విక్రయించే చోట అగ్ని ప్రమాదానికి గురవకుండా తగిన అప్రమత్త చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.