JGL: కొడిమ్యాల మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను సేక్టోరల్ ఆఫీసర్ సత్యనారాయణ సందర్శించారు. పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ.. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఏ విధంగా చదవాలో చెబుతూ, ఇంట్లో వారికి ఉండే ఇబ్బందులను గురించి ఆలోచించకుండా తమ చదువు పై దృష్టి ఉంచుకుని మంచి మార్కులు సాధించాలని చెప్పారు. మంచి మార్కులు సాధించే దిశగా అడుగులు వెయ్యాలన్నారు.