PDPL: రామగుండం నియోజకవర్గాన్ని దశలవారీగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ అన్నారు. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని జనగామలో రూ. 1.97 కోట్ల నిధులతో చేపట్టే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్లు పనులను నాణ్యతతో, సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.