GNTR: పాత గుంటూరులో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు 10 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 25,500 నగదు, 10 సెల్ ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.