BHNG: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డుకు చెందిన గడ్డిపాటి లక్ష్మీనారాయణకు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో రూ. ఒకటిన్నర లక్షల ఎల్ఓసి చెక్కు మంజూరైంది. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు శనివారం బాధితుడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.