HYD: నగరంలో బీసీ బంద్ ఎఫెక్ట్ రైళ్లపై పడింది. ఆర్టీసీ బస్సులు నడవకపోవడం, ప్రైవేటు వెహికల్స్ డబుల్ చార్జీలు వసూలు చేయడంతో ప్రయాణికులు రైళ్ల వైపు వెళ్లారు. దీంతో సికింద్రాబాద్, మౌలాలి, మల్కాజ్గిరి, కాచిగూడ, నాంపల్లి, రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. దీంతో పలువురు ప్రయాణికులు బోర్డింగ్పై వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణించారు.