మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి AMC గ్రౌండ్లో ఈనెల 26న మెగా జాబ్ మేళా- 2025 ఏర్పాటు చేయనున్నారు. జాబ్ మేళా ఏర్పాట్లను శనివారం మందమర్రి GM రాధాకృష్ణ పరిశీలించారు. GM మాట్లాడుతూ.. MLA వినోద్, సింగరేణి C&MD బలరాం ఆదేశాల మేరకు మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు. జాబ్ మేళాను బెల్లంపల్లి పరిసర ప్రాంత నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Tags :