మంచిర్యాల జిల్లాలో ఎక్సైజ్ టెండర్లకు భారీ స్పందన కనిపించింది. జిల్లాలోని ఏర్పాటు చేసిన పలు కేంద్రాల వద్ద 433 దరఖాస్తులు వచ్చినట్లుగా జిల్లా అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు మంచిర్యాలలో 263, బెల్లంపల్లిలో 185, లక్షెట్టిపేటలో 109, చెన్నూరులో 98, మొత్తంగా 655 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.