RR: మన్సురాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలోని శివం హిల్స్, వీరన్న గుట్ట, KVN రెడ్డి నగర్ కాలనీలలో విద్యుత్ శాఖ అధికారులతో కలిసి కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి బస్తిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. లో వోల్టేజ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వివిధ కాలనీలలో త్రీఫేజ్ లైన్లు, అవసరమైన నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయించడం జరిగిందని కార్పొరేటర్ తెలిపారు.