సత్యసాయి: పుట్టపర్తి సత్యమ్మ దేవాలయం వద్ద జీఎస్టీ అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సూర్య ఘర్ సోలార్ ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచిత విద్యుత్, బీసీలకు రూ. 20వేలు సబ్సిడీ అందిస్తామని తెలిపారు. ప్రజలకు తక్కువ జీఎస్టీ ధరలలో నిత్యవసరాలు కొనుగోలు చేయమని సూచించారు.