GDWL: లక్ష్యంతో చదివి, ఉన్నత స్థాయికి ఎదగాలని, తల్లిదండ్రులకు, విద్యా సంస్థలకు మంచి పేరు తేవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.శ్రీనివాస్ సూచించారు. శనివారం గద్వాల పట్టణంలోని మైనారిటీ పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు బాల్యవివాహాల చట్టాలు, లైంగిక వేధింపులు, పోక్సో చట్టాల గురించి అవగాహన కల్పించారు.