BHNG: జిల్లా కేంద్రంలోని ప్రిన్స్ కార్నర్ చౌరస్తాలో బీసీ రిజర్వేషన్ సాధన కోసం తెలంగాణ బంద్‌లో శనివారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్లు ఎవరు ఇచ్చే బిక్ష కాదని, అవి మా హక్కు అన్నారు. రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్ రక్షించుకోవటమే ధ్వేయంగా తెలంగాణ బంద్‌లో పాల్గొన్నామన్నారు.