NZB: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ప్రారంభించి 100 ఏళ్లు పూర్తైన సందర్భంగా కమ్మర్ పల్లి శాఖ ఆధ్వర్యంలో కమ్మర్పల్లి ఖండ పద సంచాలన్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. సుమారుగా 150 మంది స్వయం సేవకులు పాల్గొన్నారు. హిందువుల ఐక్యత కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగభూషణం, రాజశేఖర్, పాల్గొన్నారు.