KNR: వీణవంక మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం నూతన అధ్యక్షుడిగా కె. అంజయ్య (వల్బాపూర్) ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా బీ.రవి, గౌరవ అధ్యక్షుడిగా కిషన్, ఉపాధ్యక్షులుగా హరీశ్, యశోద ఎన్నికయ్యారు. కార్యదర్శుల హక్కుల కోసం నూతన కమిటీ కృషి చేయాలని ఈ సందర్భంగా వారు తీర్మానించారు. కార్యవర్గ సభ్యులు అందరూ నూతన అధ్యక్షుడికి అభినందనలు తెలిపారు.